కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
అణువణువున ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే
మెదడుకి పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరయినది నిదరకే
తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
ఒకటొకటిగ పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగ చులకనగ చూడకని
పలికెను ప్రతి క్షణమిలా
ఒకటొకటిగ తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా
వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుపడదే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
Comments (0)
The minimum comment length is 50 characters.
Information
There are no comments yet. You can be the first!
Login Register
Log into your account
And gain new opportunities
Forgot your password?